రాజకీయ నాయకులు నోరు జారడం, నోరు పారేసుకోవడం చూస్తుంటారు. ఆ తరువాత నాలుక కరుచుకుని చాకచక్యంగా క్షమాపణ చెప్పడాన్ని విన్నాం. మీడియా వక్రీకరించిందని, తన భావాన్ని మరోలా అర్థం చేసుకున్నారని కొందరు రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో సమర్థించుకున్న సంఘటనలు అందరికీ తెలిసినవే. ఆ కోవలోకి వచ్చేలా `ప్రధాని మోడీని హత్య చేయండి, రాజ్యాంగాన్ని కాపాడండి` అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్, (Madhyapradesh Congress Leader) మాజీ మంత్రి రాజా పటేరియా (Raja Pateria ) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదానికి ఆ వ్యాఖ్యలు దారితీయడంతో `మోడీని (PM Modi) హత్యం చేయండంటే వచ్చే ఎన్నికల్లో ఓడించమని అర్థం` అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తే, రాజ్యాంగం కాపాడబడుతుందని జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజా పటేరియా ఫ్లోలో అనేశారు. ఆ వ్యాఖ్యలు ప్రసారం తరువాత వివాదంగా మారడంతో పాటు సంచలన రేకెత్తిస్తున్నాయి. దీంతో తాను చేసిన వ్యాఖ్య సందర్భానుసారంగా ప్రదర్శించబడిందని స్పష్టం చేశారు. ‘ప్రధానిని చంపడం’ అంటే వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించడమేనని రాజా పటేరియా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన వ్యాఖ్యలు మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి.
“ఇది ఇంటర్వ్యూ మధ్యలో మాటల ఫ్లోలో అలా దొర్లిఉండొచ్చు. కానీ దానిని రికార్డ్ చేసిన వ్యక్తి దాన్ని ఎంచుకున్నాడు, ”అని పటేరియా అన్నారు. మధ్యప్రదేశ్ మాజీ మంత్రి తన చుట్టూ ఉన్న తన మద్దతుదారులను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడారని కాంగ్రెస్ సమర్థించుకుంటోంది. “రాజ్యాంగాన్ని రక్షించడానికి” ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయాలని ఉద్దేశ్యపూర్వకంగా పిలుపునిచ్చారని బీజేపీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ముస్సోలినీకి చెందినదని, మహాత్మాగాంధీకి చెందిన పార్టీ కాదని బీజేపీ విమర్శించింది.
“ఈ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీకి చెందినది కాదని స్పష్టంగా సూచించేలా పటేరియా వ్యాఖ్యలను నేను విన్నాను” అని మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నాయకుడు నరోత్తమ్ మిశ్రా అన్నారు.“ఈ కాంగ్రెస్ ఇటలీకి చెందినది, దాని సిద్ధాంతం ముస్సోలినీది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తున్నాను’ అని నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మొత్తం మీద మధ్యప్రదేశ్ కేంద్రంగా బీజేపీ, కాంగ్రెస్ నడుమ నోటి దురుసు లీడర్ కారణంగా రాజకీయ యుద్ధం ప్రారంభం అయింది.
Also Read: Hyderabad City Metro: హైదరాబాద్ `మెట్రో` ప్రయాణం నరకం