Jawans Kidnapped : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేశారు. అనంత్‌నాగ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లను (హిలాల్ అహ్మద్ భట్, ఫయాజ్ అహ్మద్ షేక్) ఉగ్రమూకలు అపహరించారు. ఈ ఘటన యావత్ కశ్మీర్‌లో కలకలం రేపుతోంది. ఓ వైపు కశ్మీరులో శాంతి భద్రతలను స్థాపించామని కేంద్ర ప్రభుత్వం (Jawans Kidnapped) చెబుతుండగా.. మరోవైపు ఉగ్రవాదులు నేరుగా ఆర్మీ జవాన్లనే కిడ్నాప్ చేస్తుండటం వాస్తవ పరిస్థితులను అద్దంపడుతోంది. అయితే కిడ్నాప్‌కు గురైన ఒక జవాన్ (ఫయాజ్ అహ్మద్ షేక్) చాకచక్యంగా ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకొని వచ్చేశాడు. ఆయన భుజం, ఎడమ కాలికి గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించారు. మరో జవాన్‌ను(హిలాల్ అహ్మద్ భట్) ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. అమరుడైన సదరు జవాన్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
Also Read :Highest Peaks : ఈ టీనేజర్ 14 మహా పర్వతాలను ఎక్కేశాడు.. కొత్త రికార్డుల ప్రభంజనం
జవాన్ భౌతిక కాయం లభ్యమైన అనంత్‌నాగ్ అటవీ ప్రాంతం పరిసరాల్లో భారత సైన్యం ప్రస్తుతం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ఏరియాను జల్లెడ పడుతున్నారు. భారత జవాన్ హిలాల్ అహ్మద్ భట్.. అనంత్‌నాగ్ జిల్లా ముక్దంపోరా నౌగామ్ వాసి. మరో జవాన్ ఫయాజ్ అహ్మద్ షేక్, హిలాల్ అహ్మద్ భట్‌లు జమ్మూకశ్మీర్ టెరిటోరియల్ ఆర్మీ 162వ యూనిట్‌లో సేవలు అందిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే ఉగ్ర రాక్షసులు ఈ దారుణానికి తెగబడటం గమనార్హం.
Also Read :Mental Health Day 2024 : మానసిక సమస్యల వలయంలో మానవాళి.. అవగాహనతోనే పరిష్కారం
ఈ ఏడాది ఆగస్టు నెలలో అనంత్‌నాగ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటనలో అప్పట్లో ఇద్దరు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకు ముందు దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీస్ అధికారి అమరులయ్యారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఓ పాకిస్తాన్ పౌరుడిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది.