Site icon HashtagU Telugu

Kharge Slams Modi Govt : సామాన్యుల నడ్డి విరుస్తున్న NDA ప్రభుత్వం – ఖర్గే

Kharge Slams Modi Govt

Kharge Slams Modi Govt

ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) తీసుకుంటున్న ఆర్థిక విధానాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వ చర్యలతో దేశం ఆర్థిక సంక్షోభం(Financial Crisis)లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితి కారణంగా సామాన్యుల జీవితం (Common People Life) మరింత కష్టసాధ్యంగా మారిందని మండిపడ్డారు.

ఖర్గే తన విమర్శల్లో పరోక్ష పన్నుల పెంపు(Increase in indirect taxes) వల్ల సామాన్య ప్రజల సేవింగ్స్ తగ్గిపోయాయని అన్నారు. బంగారం రుణాల్లో (Gold Loans) 50 శాతం పెరుగుదల, బంగారు రుణ ఎన్పీఏలలో 30 శాతం వృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆదాయానికి తగ్గ వేతన పెంపు లేకపోవడం, కీలక రంగాల్లో పురోగతి మందగించడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. కార్ల కొనుగోళ్లు తగ్గిపోవడం వంటి అంశాలు దేశంలో ఆర్థిక వ్యవస్థ నడవడంలో సమస్యలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.

Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్‌ రేస్ కేసు.. ఆ ఇద్దరికి మరోసారి ఈడీ నోటీసులు

మోదీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని, పేదలు మరింత పేదవాడు అవుతున్నాడని, ధనికులు మరింత సంపన్నులవుతున్నారని ఖర్గే దుయ్యబట్టారు. ఆర్థిక రంగంపై సరైన దృష్టి పెట్టకపోవడం ప్రజలపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే వ్యూహాలు సమర్థవంతమని ఖర్గే తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనించి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.