Kharge Land Controversy: ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఆయన కుటుంబీకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా భూవివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మల్లికార్జున్ ఖర్గే తనయుడు రాహుల్ ఖర్గేకు కేటాయించిన భూముల వ్యవహారం చర్చనీయాంశమైంది.
రాహుల్ ఖర్గేకు బెంగళూరు సమీపంలోని ఏరోస్పేస్ కాలనీలో ఏసీ/ఎస్టీ కోటా కింద రాయితీపై భూమి ఇచ్చారు. కాగా ఈ విషయంలో ప్రోటోకాల్‌లను విస్మరించి రాహుల్ ఖర్గేకు 5 ఎకరాల భూమి కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అవకాశం వచ్చినట్టైంది. కేటాయించిన భూమికి సంబంధించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి కుమారుడికి రాయితీపై భూమి ఎలా ఇస్తారని బీజేపీ ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాహుల్ ఖర్గే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. అయితే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఐటీ కంపెనీలలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఖర్గే రాజీనామా చేయాలి: బీజేపీ
కుమారుడి విషయంలో మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ గళం విప్పింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, నైతిక బాధ్యత వహిస్తున్నందున తక్షణమే రాజీనామా చేయాలని, ఆయన కుటుంబం ఈ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. ఇక ప్రియాంక్ ఖర్గేకు ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో ఉండే హక్కు లేదు. ఆయన తన పదవిని దుర్వినియోగం చేశారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ముడా కుంభకోణం అయినా, వాల్మీకి వికాస్ నిగమ్ స్కాం అయినా రాష్ట్రంలో జరుగుతున్న అవకావకాలపై బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే పదవీ విరమణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రాహుల్ ఖర్గేకు భూములిచ్చిన విషయాన్ని ఆర్టీఐ కార్యకర్త కలహళ్లి లేవనెత్తారు. ఏరోస్పేస్ డిఫెన్స్ కాలనీలో సరైన నిబంధనలు, ప్రోటోకాల్‌లను విస్మరించి రాహుల్ ఖర్గేకు 5 ఎకరాల భూమి కేటాయించారని ఆర్టీఐ కార్యకర్త గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు.
Also Read: Bharat Biotech : ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల చేసిన భారత్ బయోటెక్