Amith Sha Comments : ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డెడ్ లైన్

Amith Sha Comments : అంబేడ్కర్ పట్ల ప్రధాని మోడీకి గౌరవం ఉండే వెంటనే ఇలా చేయాలనీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకి దారితీశాయి

Published By: HashtagU Telugu Desk
Kharge Modi

Kharge Modi

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi )కి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)డెడ్‌లైన్ విధించారు. అంబేడ్కర్‌(BR Ambedkar)పై కేంద్ర మంత్రి అమిత్ షా (Amith Sha) చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ఖర్గే డిమాండ్ చేశారు. దీనికి గడువుగా అర్ధరాత్రి సమయం ఇచ్చారు. అంబేడ్కర్ పట్ల ప్రధాని మోడీకి గౌరవం ఉండే వెంటనే ఇలా చేయాలనీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు అంబేడ్కర్ సాధించిన విజయాలు, సమాజానికి అందించిన సేవలను తక్కువ చేసి చూపడమేనని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. అంబేడ్కర్ వంటి మహనీయుల గౌరవాన్ని కాపాడటంలో ప్రధాని బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలు కేవలం విమర్శల వరకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా నిరసనల రూపం తీసుకోవచ్చని హెచ్చరించారు. ప్రజలు ఈ విషయంపై చైతన్యవంతులై, తమ నిరసనలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఖర్గే స్పష్టం చేశారు. అవసరమైతే అంబేడ్కర్ గౌరవం కోసం తమ ప్రాణాల్ని సైతం అర్పించేందుకు తాము వెనుకాడబోమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విపక్షాల నుండి ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు బీజేపీ శ్రేణులు మాత్రం ఈ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు దాడి చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అంబేడ్కర్ జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత వేడెక్కనుంది.

Read Also : Uniform Civil Code: జనవరి నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమల్లోకి : సీఎం ధామి

  Last Updated: 18 Dec 2024, 05:54 PM IST