Renuka Chaudhary : ఏఐసీసీ కీలక నిర్ణయం..రాజ్యసభకు రేణుకా చౌదరి

  • Written By:
  • Updated On - February 14, 2024 / 03:28 PM IST

 

AICC : ఫైర్ బ్రాండ్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి రాజ్య సభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుండి రేణుక చౌదరి(Renuka Chaudhary) పేరుని ఖరారు చేస్తూ ఏఐసిసి(AICC) నిర్ణయాన్ని తీసుకుంది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో రేణుక చౌదరి నామినేషన్ వేయబోతున్నట్లు తెలిసింది. తెలంగాణ నుండి రెండు రాజ్యసభ సీట్లు(Rajya Sabha Seats) కాంగ్రెస్ కి ఉన్నాయి. ఒకటి రేణుకా చౌదరికి కేటాయించగా మరొకటి ఏఐసీసీకి రిజర్వ్‌ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రెండవ సీటు కోసం సుప్రియ లేదా అజయ్ మాకేన్ పేర్లు పరిశీలల్లో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం ఎంపీ స్థానం ఆశించిన రేణుకా చౌదరికి రాజ్యసభ బెర్తు కన్ఫామ్ కావడంతో ఆ సెగ్మెంట్‌ నుంచి ఎవరు బరిలో నిలవనునాన్నరనేది ఆసక్తిగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ (Congress Rajya Sabha) ప్రకటించింది. రాజస్థాన్‌ నుంచి సోనియాగాంధీ, హిమాచల్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీలకు టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో పాటు బీహార్‌ నుంచి అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హందోరే పేర్లను ప్రకటించారు.

read also : PM Vishwakarma Scheme : చేతివృత్తుల వారికి 3 లక్షల లోన్.. ‘పీఎం విశ్వకర్మ’కు అప్లై చేయండిలా