మరో లిక్కర్ స్కామ్ లో కవిత నిలిచింది. మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ..ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్(Kerala Liquor Scam)లో ఆరోపణలు ఎదురుకుంటుంది. కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత VD సతీశన్ కవిత ఫై ఈ ఆరోపణలు ఆరోపించారు. పాలక్కాడ్‌లోని ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు.. సీఎం పినరయ్ విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబి రాజేష్.. ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
కవితే స్వయంగా కేరళకు వచ్చి ఈ వ్యవహారాన్ని నడిపించారని , 2023లో ఈ కుంభకోణం జరిగిందని, కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని తెలిపారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే.. మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు ఒయాసిస్ కంపెనీకి అనుమతులు లభించాయన్నారు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోట్ నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్‌లోని డిస్టిలరీలకు కూడా తెలియదన్నారు.
మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఒయాసిస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సతీశన్ తెలిపారు. పంజాబ్‌లో భూగర్భ జలాలను కలుషితం చేస్తోందంటూ ఆ కంపెనీపై కేసులున్నట్లు చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణలపై కంపెనీ నుంచి ప్రతిస్పందన లేదని, మంత్రి రాజేశ్ కంపెనీ ప్రతినిధి మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.