Menstrual Leave : దేశంలోనే తొలిసారి కేరళలో సంచలన నిర్ణయం : ఇక మహిళా స్టూడెంట్స్ కు పీరియడ్ లీవ్స్

మహిళా స్టూడెంట్స్ కు రుతుస్రావ సెలవులు(Menstrual Leave) ఇవ్వాలని కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది.

Published By: HashtagU Telugu Desk
Menstrual Pain

Menstrual Pain

మహిళా స్టూడెంట్స్ కు రుతుస్రావ సెలవులు(Menstrual Leave) ఇవ్వాలని కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ (Cochin University )ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. దీన్ని ఫాలో అయిన కేరళ ప్రభుత్వం.. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు కూడా రుతుస్రావ సెలవులు ఇవ్వాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు తమ శాఖ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలోని విద్యార్థి సంఘాల డిమాండ్ల మేరకు కుశాట్‌లో పీరియడ్ సెలవులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పీరియడ్స్ సమయంలో విద్యార్థినులు ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ సెలవులను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.ఇప్పుడు బాలికలకు 73 శాతం హాజరు తప్పనిసరి చేశారు. ఇప్పుడు కేరళలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థినులకు సంవత్సరానికి 73 శాతం హాజరు చాలు. తాజాగా పీరియడ్ లీవ్స్ కూడా చేరడం.. కనీస వార్షిక హాజరు శాతం మరో 2 పాయింట్లు తగ్గి 71 కి చేరుతుంది.

ఋతుస్రావం టైంలో..

ఋతుస్రావం అంటే.. కడుపు నొప్పి తప్ప మరేమీ కాదని చాలామంది అనుకుంటారు. కానీ పీరియడ్స్ (Periods) వచ్చినట్లయితే.. ఉబ్బరం, తిమ్మిర్లు , శరీర నొప్పులు, వికారం, మైకము ఉంటాయి.మానసిక కల్లోలం కలుగుతుంది.  లక్షణాల తీవ్రత ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది. ఋతుస్రావం అనేది ప్రతి స్త్రీ శరీరం, మనస్సు , భావోద్వేగాలను ప్రతి నెలా ఒక వారం పాటు ప్రభావితం చేస్తుంది.  దశాబ్దాలుగా పీరియడ్స్ గురించి పెద్దగా నిరసనలు లేకుండా మహిళలు నిశ్శబ్దంగా కాలం గడిపారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. వారి బాధ్యతలు ఇంటి లోపల, వెలుపల పెరిగాయి. ఇటువంటి తరుణంలో కేరళ లోని ఉన్నత విద్యా సంస్థల్లో మహిళా స్టూడెంట్స్ కు పీరియడ్ లీవ్స్ ఇవ్వడం మంచి పరిణామం.

  Last Updated: 18 Jan 2023, 05:08 PM IST