Site icon HashtagU Telugu

Neet Issue : నీట్ `బ్రా` ఇష్యూలో ఐదుగురి అరెస్ట్

NEET UG result 2025

NEET UG result 2025

నీట్ సెంటర్‌లోని విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమ‌తించే ముందు బ్రాలను తీసివేయమని బలవంతం చేసిన ఐదుగురిని కేర‌ళ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మహిళలు నీట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నియమించిన ఏజెన్సీ ఉద్యోగులు. మిగిలిన‌ ఇద్దరు సంఘటన జరిగిన మార్ థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన ఎంప్లాయిస్ గా గుర్తించారు.

నీట్ ప‌రీక్ష జ‌రిగిన జులై 17 ఆదివారం నాడు బ్రాలను తొలగించమని సెంటర్‌లోని అధికారులు విద్యార్థులను బ‌ల‌వంతం చేశార‌ని విద్యార్థినుల‌ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను ఎన్‌టీఏ నుంచి పంపినట్లు మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు గతంలో వెల్లడించారు. అయితే, టెస్టింగ్ ఏజెన్సీ దీని గురించి ఎటువంటి ఫిర్యాదులను స్వీకరించలేదని తిరస్కరించింది. ఈ సంఘటన వివాదం కావ‌డంతో మంగళవారం కళాశాలో ఉన్న ఆయూర్‌లో విద్యార్థి కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఆందోళన చెందుతున్న విద్యార్థులు లాఠీలను ఉపయోగించి ఇన్‌స్టిట్యూట్ కిటికీలను పగులగొట్టినట్లు దృశ్యాలు చూపించాయి. ఇది విధ్వంసానికి దారితీసింది.

కేరళ ప్రభుత్వం ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లడంతో, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ NTA నిజనిర్ధారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి వి మురళీధరన్, కేరళకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. ఈ ఆరోపణను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ని నిజనిర్ధారణ కమిటీ ఇచ్చే ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Exit mobile version