Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(Enforcement Directorate) అరెస్ట్ చేయవచ్చని ఆప్ భావిస్తుంది. కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు జరుపుతారనే సమాచారం తమకుందని ఆప్ నేతలు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందే ఈడీ సమన్లు ఇవ్వనున్నట్టు తమ వద్ద అధరాలు ఉన్నాయని ఆప్ పేర్కొంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టుపై ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపటి నుంచి గుజరాత్‌లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు రోజులు గుజరాత్ లో గడపాల్సి ఉన్నా.. ఇప్పుడు బడ్జెట్ సమావేశం కారణంగా గుజరాత్ లో కేవలం రెండు రోజులు మాత్రమే గడపనున్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల సభ:
సీఎం కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం వడోదర విమానాశ్రయానికి చేరుకుంటారు. నేత్రాంగ్‌లో జరిగే బహిరంగ సభలో ఇద్దరు సీఎంలు ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో వాసవ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు:
సోమవారం ఎమ్మెల్యే చైత్ర వాసవతో సీఎం కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వాసవను పోటీకి దింపాలని పార్టీ తాజాగా నిర్ణయించింది. ఇటీవలే పార్టీ ఆయనను గిరిజన ముఖంగా ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 26 స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరిచింది మరియు ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ పార్టీకి రాజీనామా చేశారు.