Kejriwal Release From Tihar Jail : తీహార్ జైలు నుండి కేజ్రీవాల్ విడుదల

తాను దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానని .. నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలని పేర్కొన్నారు. దాని కోసం తాను సర్వశక్తితో పోరాడుతున్నట్లు తెలిపారు

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 09:29 PM IST

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Kejriwal) శుక్రవారం తీహార్ జైలు (Tihar Jail) నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో అరెస్టైన ఆయనకు సుప్రీం కోర్టు నేడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2న లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ కు జైలు వెలుపల పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ మఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు రావడం జరిగింది. ఆలివ్ టీషర్డ్‌లో ఉన్న కేజ్రీవాల్ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

We’re now on WhatsApp. Click to Join.

జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మొదటగా.. జైలు నుంచి త్వరలోనే బయటికి వస్తా అని మాటిచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం బయటికి వచ్చి మీ ముందు నిల్చున్నాని తెలిపారు. ఈ సందర్భంగా తాను దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానని .. నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలని పేర్కొన్నారు. దాని కోసం తాను సర్వశక్తితో పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం నినాదాలతో కేజ్రీవాల్ ర్యాలీని హోరెత్తించారు. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం సాయంత్రం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ మందిరాన్ని దర్శిస్తానని, మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహిస్తామని తెలిపారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ రావడం సంతోషంగా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. కేజ్రీవాల్ విడుదల కేవలం న్యాయానికి ప్రతీక మాత్రమే కాదని… ఇది ఇండియా కూటమికి బలం అనీ అన్నారు.

Read Also : Openers Scored Centuries: గుజరాత్ టైటాన్స్‌.. సెంచ‌రీలు కొట్టిన ఓపెన‌ర్లు..!