Delhi Liquor Scam : కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయి – ఈడీ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో చేతులు మారింది రూ.100 కోట్లు కాదు రూ.600 కోట్లు అని , కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయని , ఈ డబ్బులను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ వినియోగించిందని ఈడీ తరుపు లాయర్లు వాదించారు

Published By: HashtagU Telugu Desk
Kejriwal Court

Kejriwal Court

లిక్కర్ స్కామ్ కేసు ((Delhi Liquor Scam) )లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసి.ఈరోజు అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయన అరెస్టుపై ప్రస్తుతం కోర్టులో వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ASG రాజు వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇరు వైపులా వాదనలు ముగిసాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో చేతులు మారింది రూ.100 కోట్లు కాదు రూ.600 కోట్లు అని , కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయని , ఈ డబ్బులను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ వినియోగించిందని ఈడీ తరుపు లాయర్లు వాదించారు. హవాలా మార్గంలో రూ.45 కోట్లు చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి గోవాకు డబ్బులు చేరాయి. సౌత్‌ గ్రూప్‌, కేజ్రీవాల్‌కు విజయ్‌ నాయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు. 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాలేదని , కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్ట్ ను కోరింది. అలాగే PMLA సెక్షన్‌ 19 ప్రకారమే కేజ్రీవాల్‌ అరెస్టు జరిగింది..అరెస్టు తర్వాత రెండుసార్లు మెడికల్‌ టెస్టులు నిర్వహించాం అని తెలిపారు.

ఇదిలా ఉంటే అరెస్టైన ఒక రోజు తర్వాత, ఈ రోజు కేజ్రీవాల్..’ఈ జీవితం జాతికి అంకితం” అని తన స్పందన తెలియజేశారు. ఈడీ అధికారులు కోర్టుకి తీసుకెళ్తున్న క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆప్ చీఫ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి కూడా దేశం కోసం పనిచేస్తానని అన్నారు.

Read Also : Jogi Ramesh Celebrations : చంద్రబాబు భయపడ్డాడంటూ జోగి సంబరాలు

  Last Updated: 22 Mar 2024, 04:30 PM IST