Mann: క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్‌కి ఇవ్వడం లేదు: పంజాబ్‌ సీఎం

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 04:59 PM IST

Bhagwant Singh Mann: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో (Tihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఓ ఉగ్రవాదిలా ట్రీట్‌ చేస్తున్నారని (Treated Like Terrorist) పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) అన్నారు. ఇవాళ తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీని ఆయన కలిశారు. ఒక గ్లాస్‌ వాల్ గుండా ఫోన్‌లో కేజ్రీతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

కేజ్రీతో మీటింగ్‌ అనంతరం భగవంత్‌ మాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కేజ్రీని అలా చూసి ఉద్వేగానికి లోనయ్యాను. ఆయన్ని అక్కడ ఓ కరుడుగట్టిన నేరస్థుడిలా ట్రీట్‌ చేస్తున్నారు. క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీకి ఇవ్వడం లేదు. ఆయన చేసిన నేరం ఏంటి..? దేశంలోని అతిపెద్ద టెర్రరిస్టుల్లో ఒకరిని పట్టుకున్నట్లుగా వారు కేజ్రీతో వ్యవహరిస్తున్నారు’ అని ఆయన తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

జైల్లో ఎలా ఉన్నావని తాను అడిగినప్పుడు.. కేజ్రీ తన గురించి చెప్పలేదని పంజాబ్ రాష్ట్ర ప్రజల గురించి అడిగారని భగవంత్‌ మాన్‌ తెలిపారు. పంజాబ్‌లో పరిస్థితులు, అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించే కేజ్రీవాల్‌ అడిగారని చెప్పారు. ఆప్‌ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. తామంతా కేజ్రీతో కలిసే ఉంటామని ఈ సందర్భంగా మాన్‌ పేర్కొన్నారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడికాగానే తమ పార్టీ పెద్ద రాజకీయ శక్తిగా అవతరించడం ఖాయం అని ఈ సందర్బంగా భగవంత్‌ మాన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Tummala Nageswara Rao : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్