Delhi CM Kejriwal : గుజరాత్ బీజేపీ కోటకు బీటలు…ఆ భయంతోనే ఈ దాడులు: కేజ్రీవాల్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • Written By:
  • Publish Date - August 27, 2022 / 08:23 AM IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు ఇతర మంత్రుల ఇళ్లలో సోదాలని దీనికి కారణం అన్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆప్ ను ఏ ఒక్కరూ వీడిలేదని చెప్పేందుకు అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.

గుజరాత్ లో బీజేపీకి గడ్డుకాలం:

గుజరాత్ లో బీజేపీకి గడ్డుకాలం ప్రారంభమైంది..కోటకు బీటలు పడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే CBI, EDదాడులకు పాల్పడుతున్నారు. ఈ మధ్యే ఉపముఖ్యమంత్రి మనీశ్ సొసోడియా ఇంట్లో సీబీఐ నిర్వహించిన సోదాలో ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఢిల్లీ సర్కార్ ను కూలదోయాలన్నది బీజేపీ ప్రధాన లక్ష్యం. మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే కూలగొట్టారు. బీజేపీ ప్రభుత్వాలను కూలదోయడంలో సీనియర్ కిల్లర్ అంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు….బీజేపీ మాత్రం వాటిని కూలదోస్తుందంటూ నిప్పులు చెరిగారు.

277 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు:

277మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. దీనికి రూ. 5,500కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ చేపట్టేందుకు రూ. 800కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ మొత్తాన్నంతా కూడా జీఎస్టీ, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి సమకూర్చారని ఆరోపించారు. కాగా సోమవారం నాడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.