PV Narasimha Rao : పీవీకి భారతరత్న రావడం పట్ల కేసీఆర్ స్పందన

మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao) భారత ఆర్థిక […]

Published By: HashtagU Telugu Desk
Bharat Ratna

Bharat Ratna For Former Pms

మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao) భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదిన నేత. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని పట్టాలెక్కించారు. మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని..హరిత విప్లవం, ఎగుమతులు, టెలి కమ్యూనికేషన్, టెక్నాలజీతో దేశం స్వయంసమృద్ధి సాధించేలా చేశారు. ఇప్పుడు ఉన్న సాంకేతికతకు బీజం వేసింది ఈ మహనీయుడే. విద్యారంగంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చారు మన తెలుగు ఠీవీ పీవీ. అప్పులతో దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితుల్లో PV నరసింహారావు ప్రధాని పదవి చేపట్టారు. 3 వారాల విదేశీ ద్రవ్య నిల్వలే మిగిలిన క్లిష్ట సమయంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఆర్థిక ప్రగతిని ఆలస్యం చేసే, అవినీతిని పెంచే లైసెన్స్ రాజ్యాన్ని రద్దు చేసి భారత్లో ప్రపంచ వర్తకానికి ద్వారాలు తెరిచారు. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్తో కలిసి తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ముఖచిత్రం మార్చి, సంక్షోభం నుంచి బయటపడేశాయి.

We’re now on WhatsApp. Click to Join.

పీవీ నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. 1952లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1957లో తొలిసారి మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అలాంటి మాజీ ప్రధానికి భారత రత్న రావడం పట్ల యావత్ ప్రజలు , రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ..ప్రధాని మోడీకి థాంక్స్ చెపుతున్నారు.

బీఆర్ఎస్ డిమాండ్ను గౌరవించి కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ ఇచ్చినందుకు మాజీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని PVకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల KCR హర్షం వ్యక్తం చేసినట్లు ‘BRS’ పార్టీ ట్వీట్ చేసింది. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు.

అలాగే కేటీఆర్ స్పందిస్తూ.. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పీవీఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించింది. అప్పటి నుంచి ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

అలాగే తన తండ్రి పీవీకి భారతరత్న ప్రకటించడంపై ఆయన కూతురు, ఎమ్మెల్సీ వాణీదేవి భావోద్వేగానికి గురయ్యారు. ‘కొంచెం ఆలస్యమైనా చివరికి నాన్నకు గొప్ప గౌరవం దక్కింది. ఇప్పటికీ ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలే దేశానికి దిక్సూచీ. పార్టీలకతీతంగా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం. ఇది తెలంగాణతో పాటు దేశ ప్రజలందరికీ గర్వించే క్షణం’ అని ఆమె అన్నారు.

Read Also : Seethakka : ఉచిత బస్సు కావాలా..? వద్దా..? చెప్పండి – సీతక్క

  Last Updated: 09 Feb 2024, 01:43 PM IST