Site icon HashtagU Telugu

KCR House : అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్న కేసీఆర్

Kcr House Vacated Delhi

Kcr House Vacated Delhi

ఎప్పుడు ఏంజరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరు పైచేయి సాధిస్తారో..ఎవ్వరు ఎప్పుడు ఓటమి చెందుతారో చెప్పలేం. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. పదేళ్ల పాటు మకుటంలేని రాజుగా పాలించిన కేసీఆర్ (KCR)..నేడు ఎమ్మెల్యే పదవికి మాత్రం అర్హుడయ్యాడు. రెండుసార్లు అధికారం చేపట్టి..మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని ఎన్నో కలలు కన్నాడు..అంతే విధంగా కష్టపడ్డాడు కానీ ప్రజలు మాత్రం ఏకధాటిగా బిఆర్ఎస్ కు బై బై చెప్పేసారు.

ఈ ఓటమి ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు. ఇదే క్రమంలో తనకు కలిసొచ్చిన ఇళ్లను సైతం ఖాళీ చేయిస్తున్నాడు. తాజాగా ఢిల్లీలో అధికారిక నివాసం (Residence )గా ఉన్న తుగ్లక్ రోడ్డు (Tughlaq Road Delhi)లోని 3వ నెంబరు ఇంటిని ఖాళీ చేస్తున్నారు. ఈ ఇంటికి..కేసీఆర్ కు 20 ఏళ్ల అనుబంధముంది. అలాంటి అనుబంధానికి ఇప్పుడు తెరదించుతున్నారు. 2004 నుండి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని ఇల్లు అప్పట్లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పటి నుండి అధికారిక నివాసంగా ఉంది. ఆ తర్వాత సీఎంగా ఉన్న సమయంలో ఆ ఇంటిని అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని సిబ్బంది ఖాళీ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతున్న సమయంలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక భవనాలను ఖాళీ చేయాల్సిందే. ఇప్పటికే పలువురు మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారిక భవనాలను ఖాళీ చేస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లోనే తమ సామాగ్రిని తరలిస్తున్నారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను కూడా కేసీఆర్ ఖాళీ చేయాల్సిందే. ఇప్పటికే ఆయన ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కి వెళ్లారు. ప్రస్తుతం అక్కడి నుంచే పార్టీ కలాపాలు చూసుకుంటున్నారు.అధికారం కోల్పోయిన ఏ ప్రజాప్రతినిధి అయినా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ఒక నెల సమయం ఉంటుంది. కానీ, కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో ఇల్లు పూర్తిగా ఖాళీ చేయనున్నారు.

Read Also : KCR : కేసీఆర్ విషయంలో తథాస్తు దేవతలు ..తథాస్తు అన్నారా..?