KBC 16 Crorepati : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి కేబీసీ-16 షోలో(KBC 16 Crorepati) కోటి రూపాయలు గెల్చుకున్న తొలి పోటీదారుడిగా చందర్ ప్రకాశ్ నిలిచారు. దీంతో ఎవరీ చందర్ ప్రకాశ్ అనే దానిపై నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన చాలా కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఈనేపథ్యంలో చందర్ ప్రకాశ్‌పై కథనమిది.
Also Read :Atishi No 1 : అతిషి నంబర్ 1.. కేజ్రీవాల్ నంబర్ 41.. ఢిల్లీ అసెంబ్లీ సీటింగ్‌లో మార్పులు
చందర్ ప్రకాశ్ కోటీశ్వరుడు ఇలా అయ్యాడు
- కేబీసీ-16లో కోటి రూపాయలు గెల్చుకున్న చందర్ ప్రకాశ్ జమ్మూ కశ్మీర్ వాస్తవ్యుడు.
- చందర్ ప్రకాశ్ వయసు 22 ఏళ్లు. ఆయన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.
- ఆయన పుట్టుకతోనే పేగు సమస్యతో జన్మించారు. ఇప్పటి వరకు చందర్‌కు ఏడు సర్జరీలు జరిగాయి.
- ఇప్పటికీ చందర్ ప్రకాశ్ పేగు సమస్యలతో బాధపడుతున్నారు. ఎనిమిదో సర్జరీ చేయాలని డాక్టర్లు ఆయనకు సూచించారు.
- ‘‘శాంతి నివాసం అని అర్థం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవును కలిగి ఉన్న దేశం ఏది ? ’’ అనే ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పి కేబీసీ 16లో చందర్ ప్రకాశ్ కోటి రూపాయలు గెల్చుకున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసా ? .. ‘‘టాంజానియా’’. ఈ ఆన్సరే చందర్ ప్రకాశ్‌ను కోటీశ్వరుడిగా మార్చింది.
- చందర్ ప్రకాశ్ కోటి రూపాయలతో పాటు ఖరీదైన కారును కూడా అందుకున్నాడు. ఈవిషయాన్ని కేబీసీ 16 షోలో స్వయంగా అమితాబ్ బచ్చన్ వెల్లడించారు.
- కోటి రూపాయలు గెల్చుకున్న సందర్భంగా చందర్ ప్రకాశ్‌ను ఆప్యాయంగా కౌగిలించుకొని మరీ అమితాబ్ అభినందించారు.
- కోటి రూపాయల ప్రశ్నకు కరెక్టు ఆన్సర్ చెప్పిన తర్వాత .. రూ.7 కోట్ల ప్రశ్నను చందర్ ప్రకాశ్ ఎదుర్కొన్నారు. ‘‘1587లో నార్త్ అమెరికాలో ఆంగ్ల తల్లిదండ్రులకు జన్మించి మొదటిగా నమోదు చేయబడిన బిడ్డ ఎవరు?’’ అనేది ఆ ప్రశ్న. దీనికి చందర్ ప్రకాశ్ కరెక్టు ఆన్సర్ చెప్పలేకపోయారు. దీంతో రూ.7 కోట్లను గెల్చుకునే అవకాశాన్ని మిస్ అయ్యారు.