Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు

  • Written By:
  • Updated On - March 26, 2024 / 01:00 PM IST

 

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court, Delhi)లో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటీషన్, ఈడీ కస్టడీ పిటీషన్ల పై సుధీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ సందర్బంగా ఈడీ 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశామని.. మరికొందరిని ప్రశ్నిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవితను.. కీలక అంశాలపై ఆరా అధికారులు ఆరా తీశారు. లిక్కర్‌ స్కామ్‌లో రూ.వందకోట్ల ముడుపులపై ఈడీ ఆరాతీసింది. ఈ వ్యవహారాన్ని కవితే నడిపించారంటూ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అయితే, కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటీషన్ పై వివరణ ఇచ్చేందుకు ఈడీ సమయం కోరడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆర్టర్ ను రిజర్వ్(Reserve) చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కవితని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నామని.. కొందరితో ఎదురు బొదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించామని ఈడీ కోర్టుకు తెలిపింది. వైద్య పరీక్షల నివేదికలు కవితకు అందజేయాలని కోరిన కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కవిత బెయిల్ పిటిషన్ మీద రిప్లై ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. వచ్చే నెల 16 వరకు చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం, కవిత అభ్యర్థనపై ఆర్డర్ రిజర్వ్ చేశారు.. జడ్జి కావేరి బవేజ.. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ మీద సైతం తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది.

Read Also: KCR Family : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరం..!

కాగా, కోర్టుకు హాజరవుతున్న క్రమంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ పేర్కొన్నారు. తాను క్లీన్ గా బయటకు వస్తానని.. అప్రూవర్ గా మారనని పేర్కొన్నారు. ‘‘ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు.. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.. మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.. నేను క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు’’.. అంటూ కవిత పేర్కొన్నారు.