Kavitha : తిహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌

Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో బీఆర్ఎస్(brs) ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఈడీ అధికారులు ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు9Rouse Avenue Court)లో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరి భవేజా ముందు కవితను హాజరుపర్చారు. మరో 14 రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిశాక కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, కాసేపటికే తీర్పు ఇచ్చింది. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ(14 […]

Published By: HashtagU Telugu Desk
Kavitha to Tihar jail.. 14 days judicial remand

Kavitha to Tihar jail.. 14 days judicial remand

Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో బీఆర్ఎస్(brs) ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఈడీ అధికారులు ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు9Rouse Avenue Court)లో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరి భవేజా ముందు కవితను హాజరుపర్చారు. మరో 14 రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిశాక కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, కాసేపటికే తీర్పు ఇచ్చింది. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ(14 days judicial custody)కి అప్పగించింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలు(Tihar Jail)లో ఉండనున్నారు కవిత.

రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్, బంధువులు ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరఫు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు.
We’re now on WhatsApp. Click to Join.

కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్ లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

Read Also: Virat Kohli Message: అమెరికా పిచ్ లకు నేను సరిపోనా.. టీ ట్వంటీ వరల్డ్ కప్ పై కోహ్లీ కామెంట్స్

కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మీడియాతో కవిత అన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవర్ గా మారడం లేదని అన్నారు.

 

  Last Updated: 26 Mar 2024, 03:13 PM IST