Delhi Liquor Scam : MLC కవిత కు బిగ్ షాక్..రిమాండ్ విధించిన కోర్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బిగ్ షాక్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను శుక్రవారం హైదరాబాద్ లోని ఆమె నివాసం ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీ […]

Published By: HashtagU Telugu Desk
Kavitha Remanded To Ed Custody Till March 23

Kavitha Remanded To Ed Custody Till March 23

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బిగ్ షాక్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను శుక్రవారం హైదరాబాద్ లోని ఆమె నివాసం ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె మనీలాండరింగ్కు పాల్పడినట్లు, ఈ కేసుకు సంబదించిన వారిలో ఈమె ముఖ్యమైందని పేర్కొని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదించారు. సుదీర్ఘ వాదనలు విన్న కోర్ట్ ఆమెను ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది. దీంతో ఆమె మార్చి 23 వరకు ఈడీ కస్టడీలో ఉండనుంది.

ఈమె రిమాండ్ రిపోర్ట్ చూస్తే..ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత కీలక సూత్రధారుల్లో ఒకరు. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటుచేసి కుట్ర చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కుమ్మక్కై రూ.100 కోట్ల మేర ముడుపులను సమర్పించారు. ఆ మేరకు ప్రతిఫలం పొందేలా ఢిల్లీ మద్యం పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని రిమాండ్ రిపోర్టులో ఉంది.

Read Also : Lok Sabha Election 2024: 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్‌

  Last Updated: 16 Mar 2024, 05:34 PM IST