ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case)లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు భారీ ఊరట లభించింది. కేసు విచారణను నవంబర్ 20 కి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్. రెండు రోజులుగా తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ , కేసీఆర్ కూతురు కవితను (MLC Kavitha) అరెస్ట్ చేస్తారనే వార్తలు వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Sam)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ED అరెస్టు చేయబోతోందని..ఈ కేసుకు సంబదించిన కీలక ఆధారాలు ఈడీ కి లభించాయని..వీటిలో కోర్ట్ లో పొందుపరిచి..ఆమెను అరెస్ట్ చేయబోతున్నారని ఇలా రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ సుప్రీం కోర్ట్ మాత్రం కవిత కు భారీ ఊరట కల్పించింది.
కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ ఈడీ సమన్లు కూడా జారీ చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈడీ విచారణ ఎదుర్కొనే అంశంలో కవితకు ఊరట లభించినట్లయింది. గత విచారణ సందర్భంగా ఈడీ ముందు మహిళల హాజరు అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలకు 10 రోజుల సమయం కోరింది ఈడీ. దీంతో కవితకు 10 రోజులపాటూ నోటీసులను వాయిదా వేసింది. ఇప్పుడు మరోసారి నవంబర్ 20 వరకూ వాయిదా వేయడానికి అంగీకరించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే.. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు.ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అయినప్పటికీ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తన పిటిషన్ విచారణలో ఉండగా.. నోటీసులు ఎలా జారీ చేస్తారని ఈడీ తీరును ప్రశ్నించారామె. అంతే కాదు తాను విచారణకు రాలేనని ఈడీకి స్పష్టం చేశారు.
Read Also : Tollywood : మహేష్ ఫై ప్రశంసల జల్లు కురిపించిన శ్రీకాంత్ అడ్డాల