Site icon HashtagU Telugu

Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి

Kasganj Accident

Kasganj Accident

Kasganj Accident: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్‌గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్‌పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.

శనివారం ఉదయం యూపీలోని కసా పూర్వి గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న గ్రామస్థుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై ఉన్న చెరువులో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన వారు జిల్లా ఆసుపత్రిలో చేరారు. హైవే గుండా వెళుతున్న ప్రజలు ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో పోలీసులు బాధితుల్ని అతి కష్టం మీద బయటకు తీశారు.మధ్యాహ్నం 12 గంటల సమయానికి 15 మృతదేహాలను బయటకు తీశారు. ఆ తర్వాత మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య 19కి పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కస్సా తూర్పు గ్రామానికి చెందిన ప్రజలు అక్కడికి చేరుకోవడంతో చెరువు గట్టుపై గందరగోళం నెలకొంది. రద్దీ కారణంగా హైవే రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఓ పాటియాలీ విజయ్ రాణా తెలిపారు. పలువురు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ట్రాక్టర్ ప్రమాదంలో మృతుల్లో మహిళలు, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉన్నారు.

ప్రమాద ఘటనపై సీఎం ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇక ఈ ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: Pawan Kalyan : పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదా..?