Karnataka: టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిర్వార్ పట్టణంలో అప్పటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది .బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు

Karnataka: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిర్వార్ పట్టణంలో అప్పటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది .బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు టిప్పు సుల్తాన్‌ విగ్రహానికి చెప్పులతో పూలమాల వేసి నివాళులర్పించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెల్లవారుజామున ప్రజలు గమనించడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనను ఖండిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు టిప్పు సర్కిల్ వద్ద నిరసనకు దిగారు .

విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డును దిగ్బంధించి నిరసన స్థలంలో టైర్లను తగులబెట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Budget 2024: రేపే కేంద్ర బడ్జెట్… మధ్యతరగతి ప్రజలకు తీపికుబురు.. ?