Karnataka Police: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కాషాయ జెండా ఎగరేసే ప్రయత్నం

మతం, కులానికి అతీతంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని కొందరు హిందూ మతం పేరుతో కాషాయజెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు.

Karnataka Police: మతం, కులానికి అతీతంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం రోజున కొందరు హిందూ మతం పేరుతో కాషాయజెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తుంటే కర్ణాటకలో కొందరు కాషాయ జెండాను ఎగురవేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.

కర్ణాటక బెలగావి జిల్లాలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంతో పాటు కాషాయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించగా కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని నిపాని నగరంలోని మున్సిపాలిటీ భవనంపై త్రివర్ణ పతాకంతోపాటు ఇద్దరు కార్పొరేటర్లు తమ మద్దతుదారులతో కలిసి కాషాయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. బీజేపీ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శశికళ జోలె, జిల్లా యంత్రాంగం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.

మున్సిపాలిటీ కార్పొరేటర్లు వినాయక వాడే, సంజయ సంగవ్కర్ కాషాయ జెండాలతో వచ్చి ఎగురవేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కార్పొరేటర్లను అడ్డుకుని వెనక్కి పంపారు. కార్పొరేటర్లకు ఎన్సీపీ పార్టీ మద్దతుగా నిలిచినట్లు తెలుస్తుంది.

Also Read: Hasaranga Retire: శ్రీలంకకు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్‌..!