Site icon HashtagU Telugu

JP Nadda : జేపీ నడ్డాకు కర్ణాటక పోలీసులు బిగ్ షాక్..

JP NADDA

JP NADDA

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా(JP Nadda )కు కర్ణాటక పోలీసులు (Karnataka Police) షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా లో వివాదాస్పద పోస్టులు చేసారని ఆయనకు సమన్లు జారీచేశారు. జెపి తో పాటు ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాకు సైతం నోటీసులు జారీ చేసారు. బెంగుళూర్ పోలీస్ ఎదుట వీరు వారం లోపు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా కర్ణాటలకలో ప్రచారం నిర్వహిస్తున్న జేపీ నడ్డా.. బీజేపీ పార్టీపై వివాదాస్పద పోస్ట్ లను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా బీజేపీ పార్టీ రాష్ట్ర యూనిట్ పెట్టిన X పోస్ట్‌ అభ్యంతరకరంగా ఉందంటూ కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ముస్లిం ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానమని ప్రధాని మోడీ సహా బిజెపి నేతలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మాటలు ప్రతిబింబించేలా ఒక వీడియోను బిజెపి కర్ణాటక యూనిట్ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియోను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పోస్టును వెంటనే తొలగించాలని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలు ఇచ్చారు. దానిని తొలగించాలంటూ మంగళవారం ఎక్స్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. దీనిపై పోలీసులు ఈరోజు నడ్డాకు నోటీసులు జారీ చేసారు.

Read Also : PM Modi Mega Roadshow In VJD : వైసీపీకి దడ పుట్టించిన మోడీ రోడ్ షో…