Site icon HashtagU Telugu

Rape Case : మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కర్ణాటక లింగాయత్ సీయ‌ర్ అరెస్ట్‌

Lingayat seer Shivamurthy Murugha Sharanaru

Lingayat seer Shivamurthy Murugha Sharanaru

మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, లింగాయత్ సీయర్ శివమూర్తి మురుగ శరణారావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో కింద కేసు నమోదు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈరోజు చిత్రదుర్గ కోర్టులో ఆయన రిమాండ్‌ను పోలీసులు కోరనున్నారు. వైద్య పరీక్షల కోసం చిత్రదుర్గలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మ‌ఠం హాస్టల్ వార్డెన్‌తో సహా మొత్తం ఐదుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అంతకుముందు రోజు అత్యాచారం కేసులో హాస్టల్ వార్డెన్ రష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు మైనర్ల తరపున ఫిర్యాదు చేయడంతో మైసూరు నగర పోలీసులు శివమూర్తి మురుగ శరణారావుపై కేసు నమోదు చేశారు. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువుతున్న 15, 16 ఏళ్ల ఇద్దరు బాలికలను మూడున్నరేళ్లకుపైగా శిమూర్తి లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు బాలికలు మైసూరులోని ఒక ప్రభుత్వేతర సంస్థను సంప్రదించి, ఆరోపించిన వేధింపులను వివరించడంతో ఈ కేసు బ‌య‌టికి వ‌చ్చింది.

లింగాయత్‌ పీఠాధిపతిపై అత్యాచారం కేసు నమోదు కావడంతో మురుగ మఠానికి చెందిన విద్యార్థులను ప్రభుత్వ హాస్టల్‌కు తరలించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు దళిత బాలిక కావడంతో పీఠాధిప‌తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. ఈ కేసు నేప‌థ్యంలో చిత్రదుర్గలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే పక్కనే ఉన్న దావణగెరె జిల్లా నుంచి మరిన్ని బలగాలను తర‌లించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు ఈ కేసు తనకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ కుట్రలో భాగమని పీఠాధిప‌తి పేర్కొన్నాడు. తాను నిర్ధోషిగా బయటకు వస్తానని శివమూర్తి మురుగ శరణారావు తెలిపాడు.