Siddaramaiah vs DK Shivakumar : బ్రేక్ ఫాస్ట్ మీట్ సిద్ధ-శివలను కలుపుతుందా..?

Siddaramaiah vs DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మార్పుపై ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (డీకే) ఇద్దరూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం

Published By: HashtagU Telugu Desk
Siddaramaiah Dk Shivakumar

Siddaramaiah Dk Shivakumar

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మార్పుపై ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (డీకే) ఇద్దరూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అనూహ్య భేటీకి సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్‌ను ఆహ్వానించారు. సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ వెళ్లడం, వారు అల్పాహారం చేస్తూ ఏకాంతంగా చర్చించుకోవడం వెనుకగల ఉద్దేశం, ముఖ్యంగా వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం పదవిని పంచుకోవడంపై (Power Sharing) అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఇద్దరు కీలక నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

Telangana Gram Panchayat Polls : సీఎం రేవంత్ స్వగ్రామంలో ‘సర్పంచ్’ ఏకగ్రీవం!

సీఎం పదవిని పంచుకునే అంశంపై గతంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం (Congress High Command) ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కుర్చీపై తుది నిర్ణయాన్ని సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ ఇద్దరే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాలని అధిష్ఠానం స్పష్టం చేసింది. అధిష్ఠానం జోక్యం చేసుకోకుండా, వారిద్దరికే ఈ బాధ్యతను అప్పగించడం, వారి మధ్య ఏకాభిప్రాయం కుదరడం ఎంత అవసరమో తెలియజేస్తుంది. కర్ణాటకలో తమ అధికారం నిలబడాలంటే ఈ ఇద్దరు బలమైన నేతల మధ్య ఐక్యత చాలా ముఖ్యం. అందువల్లే, ఈ భేటీ అధిష్ఠానం ఇచ్చిన స్వేచ్ఛ మేరకు రాజీకి, లేదా ఒక ఒప్పందానికి రావడం కోసమే జరిగి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ అంతా ముఖ్యమంత్రి కుర్చీని వదులుకోవడానికి సిద్ధరామయ్య అంగీకరిస్తారా? లేదా? అనే అంశం చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి పదవిలో తాను కొనసాగాలని సిద్ధరామయ్య భావిస్తుండగా, తొలి టర్మ్‌లో కాకపోయినా, రెండో టర్మ్‌లోనైనా తాను ముఖ్యమంత్రి కావాలని డీకే శివకుమార్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఈ బ్రేక్ ఫాస్ట్ భేటీలో సిద్ధరామయ్య ఏ విధంగా స్పందించారు, డీకే శివకుమార్ వైఖరి ఏమిటనేది కీలకం కానుంది. వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే, కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంది. ఈ భేటీ ఫలితంపైనే కర్ణాటక కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

  Last Updated: 29 Nov 2025, 11:29 AM IST