కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka Govt) వరుసగా పన్నులు (Cess) పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే వివిధ సేవల ఛార్జీలను పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు గార్బేజ్ సెస్ (Garbage Cess) పేరుతో చెత్త సేకరణపై కొత్త పన్ను విధించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత కారణంగా, ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఈ విధమైన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) ఈ కొత్త సెస్‌ను ప్రవేశపెట్టింది.
Houses : ఏపీలో వారందరికీ ఇళ్ల స్థలాలు – మంత్రి కీలక ప్రకటన
ఈ గార్బేజ్ సెస్ భవన విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని విధించబడింది. 600 చదరపు అడుగులలోపు గల నివాస భవనాలకు నెలకు రూ.10 (ఏడాదికి రూ.120), 4,000 చదరపు అడుగుల మించిన భవనాలకు నెలకు రూ.400 (ఏడాదికి రూ.4,800) ఛార్జీ విధించారు. వాణిజ్య భవనాల విషయంలో, చెత్త తూగింపును ఆధారంగా చేసుకుని కేజీకి రూ.12 చొప్పున వసూలు చేయనున్నారు. దీనివల్ల BBMPకి సంవత్సరానికి రూ.685 కోట్ల ఆదాయం సమకూరనుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ వాదన ప్రకారం.. ఈ నిధులను బెంగళూరు నగర చెత్త సేకరణను మెరుగుపరిచేందుకు వినియోగిస్తామని స్పష్టం చేశారు.
Modi : మోడీ ఆ పని చేస్తే 10 లక్షల మందితో సభ పెట్టి సన్మానిస్తా – రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ఛార్జీలు, టాక్స్‌లు పెంచుతూ ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారం పెంచిందని, ఇప్పుడు మరో కొత్త పన్నుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని ఆక్షేపిస్తున్నారు. కేంద్రమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పాలన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తరహాలో మారిందని విమర్శించారు. ప్రజలు ఓటు వేసిన ప్రభుత్వం ఇలా అనేక కొత్త పన్నులు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి.