Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి మార్పు వార్తలతో పాటు, మంత్రి-ఎమ్మెల్యేల మధ్య విమర్శలు తీవ్రంగా మారడంతో రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్సెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌గా ఈ సంక్షోభం రూపాంతరం చెందుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కొందరు ఎమ్మెల్యేలు త్వరలోనే సీఎం మార్పు జరుగుతుందని వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు సిద్ధరామయ్యకే మద్దతు ప్రకటిస్తున్న గుంపు కూడా ఉంది. అయితే, ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఓ ఫోన్ కాల్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Union Cabinet : పలు కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
బీఆర్ పాటిల్ మాట్లాడుతూ – “సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది. ఆయన అదృష్టం బాగుంది. నేనే ఆయనను సోనియా గాంధీకి పరిచయం చేశాను. ఆయనకు గాడ్‌ఫాదర్ ఉన్నాడు, నాకు లేరు. నా అభిప్రాయాలను రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాకు చెప్పాను, ఇప్పుడు ఏమి జరుగుతుందో చూస్తాం,” అంటూ ఓ కాల్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పాటిల్ – సిద్ధరామయ్యకు సీఎం పదవి రావడంలో తనే కీలకంగా వ్యవహరించానన్న సందేశం స్పష్టంగా వ్యక్తమవుతోంది. తనకు మాత్రం అలాంటి అదృష్టం లేదన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సిద్ధరామయ్యను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసినప్పటికీ, పాటిల్ వీడియో ఇప్పుడు పార్టీ అంతర్గత వర్గ రాజకీయాలను మరింత భగ్గుమంటోంది.
Costly Buffalo : రూ.14 లక్షలు పలికిన గేదె.. బన్నీ జాతి గేదెల స్పెషల్ స్టోరీ