Site icon HashtagU Telugu

Kapil Sibal : కాంగ్రెస్ కు గుడ్ బై, ఎస్పీతో రాజ్య‌స‌భ‌కు క‌పిల్‌

సీనియ‌ర్ లీడ‌ర్ క‌పిల్ సిబాల్ రూపంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న సమాజా వాదీ పార్టీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు ప‌రిచారు. జీ23 నేత‌లలో ప్ర‌ముఖంగా ఉన్న ఆయ‌న రాజీనామాతో సోనియా కోట‌రీ డైల‌మాలో ప‌డింది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన ఆయ‌న మే 16న భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఉత్తరాఖండ్ అధికారిక ట్విట్టర్ పేజీ నుండి వరుస ట్వీట్లు కపిల్ సిబల్ చేశారు. తన రాజ్యసభ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి అఖిలేష్ యాదవ్‌తో కలిసి నడుస్తున్న ఫోటోల‌ను ట్విట్ట‌ర్లో ఉంచారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశాడు. “నేను (ఒక) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసాను. నేను ఎప్పుడూ దేశంలో స్వతంత్ర స్వరం కావాలని కోరుకుంటున్నాను, “స్వతంత్ర స్వరం కావడం ముఖ్యం. ప్రతిపక్షంలో ఉంటూనే మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.` అంటూ ట్వీట్ చేశారు.

కపిల్ సిబల్‌ను ప్రశంసిస్తూ “ఈరోజు కపిల్ సిబల్ నామినేషన్ దాఖలు చేసిన విష‌యాన్ని అఖిలేష్ వెల్ల‌డించారు. ఎస్పీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారని చెప్పారు. కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది. పార్లమెంట్‌లో తన అభిప్రాయాలను చక్కగా చెప్పారు.