Site icon HashtagU Telugu

Kapil Sibal: సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కపిల్‌ సిబల్‌

Kapil Sibal

Kapil Sibal

Kapil Sibal: గురువారం (మే 16) సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కపిల్ సిబల్‌కు 1,066 ఓట్లు రాగా, ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు వచ్చాయి. ఇది కాకుండామూ డవ ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ఆదిష్ అగర్వాల్ మూడవ స్థానంలో నిలిచారు. కపిల్ సిబల్ 20 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో సిబల్‌ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1066 ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి సీనియర్‌ న్యాయవాది ప్రదీప్‌ రాయ్‌పై గెలుపొందారు. ప్రదీప్‌కు 689 ఓట్లు వచ్చాయి. ఎస్‌సీబీఏ అధ్యక్ష పదవికి సిబల్‌ ఎన్నిక కావడం ఇది నాలుగోసారి. కపిల్ సిబల్ హార్వర్డ్ లా స్కూల్ నుండి చదువుకున్నారు. కపిల్ సిబల్ 1989 నుండి 1990 వరకు భారతదేశానికి అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

Also Read: Pooja Hegde : మళ్ళీ సౌత్‌లో అవకాశాలు అందుకుంటున్న బుట్టబొమ్మ.. సూర్య సినిమాలో..!

క‌పిల్ సిబ‌ల్‌ను ప‌లువురు అభినందించారు

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కపిల్ సిబల్ 1,066 ఓట్లతో విజయం సాధించారు. SCBA ఎన్నికలలో విజయం సాధించినందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ అభినందించారు. SCBA ఎన్నికలలో విజయం సాధించినందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ అభినందించారు. సీనియర్ న్యాయవాది సిబల్ 1,066 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి, సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌పై విజయం సాధించారు.

We’re now on WhatsApp : Click to Join

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ ఎన్నికైన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన స్పందనను తెలియజేస్తూ తన సోషల్ మీడియా ఎక్స్‌లో ‘అభినందనలు సర్. ఇది చాలా శుభవార్త’ అని రాసుకొచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం కేజ్రీవాల్.. కపిల్ సిబల్ గురించి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.