Site icon HashtagU Telugu

Actress Abhinaya: సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?

Abhinaya

Cropped (3)

వరకట్న వేధింపుల కేసులో కన్నడ నటి అభినయ (Actress Abhinaya), ఆమె తల్లి, ఆమె సోదరుడిని కర్నాటక హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. కట్నం కోసం తన వదినను వేధించిన సీనియర్ నటి అభినయ (Actress Abhinaya)కు కర్ణాటక హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె అన్న శ్రీనివాస్ కు మూడేళ్లు, తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్ల శిక్ష విధించింది. శ్రీనివాస్ భార్య లక్ష్మీదేవిని వేధించిన ఆరోపణలకు సంబంధించిన కేసును బెంగళూరు నగర జిల్లా కోర్టు తోసిపుచ్చగా, లక్ష్మీదేవి హైకోర్టును ఆశ్రయించారు.

1998లో వీరిద్దరి వివాహం జరగగా, వివాహం సమయంలో రూ.80 వేల నగదు, 250 గ్రాముల బంగారం ఇచ్చారు. ఆ తర్వాత మరో లక్ష తీసుకురావాలని అభినయ తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె 2002 లో ఫిర్యాదు చేశారు. పెళ్లైన ఆరు నెలల నుండే వారు తనని వేధించారని ఆమె పోలీసులకు తెలిపారు. హైకోర్టు తీర్పు పట్ల లక్ష్మీదేవి హర్షం వ్యక్తం చేశారు.

బెంగళూరులోని చంద్రా లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో 2002లో కేసు నమోదైంది. ట్రయల్ కోర్టు 2010లో నిందితులందరినీ దోషులుగా నిర్ధారించగా, రెండేళ్ల తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ కింద అభినయ, ఆమె సోదరులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ హెచ్‌బీ ప్రభాకర శాస్త్రి ధృవీకరించారు. అభినయ సోదరుడు శ్రీనివాస్ మార్చి 1998లో లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. శ్రీనివాస్ కుటుంబం కట్నం, బంగారు ఆభరణాలు రూ.80 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. రూ.లక్ష అదనపు కట్నం తీసుకురావాలని లక్ష్మీదేవిని వేధించారని, దారుణానికి ఒడిగట్టారని లక్ష్మీదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Exit mobile version