Kanimozhi vs Annamalai: తమిళనాడులో నోటీసుల గేమ్

తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య నోటీసుల గేమ్ నడుస్తుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై డీఎంకే నేత ఆర్ఎస్ భారతిపై పరువు నష్టం దావా వేశారు.

Kanimozhi vs Annamalai: తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య నోటీసుల గేమ్ నడుస్తుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై డీఎంకే నేత ఆర్ఎస్ భారతిపై పరువు నష్టం దావా వేశారు. అందు కోసం రూ.500 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపారు. మరోవైపు డీఎంకే ఎంపీ కనిమోరి అన్నామలైకి లీగల్ నోటీసు పంపారు. కోటి పరిహారం ఇవ్వాలని కనిమోరి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, డీఎంకే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

“ఆరుధరా స్కామ్”లో అన్నామలై డబ్బు అందుకున్నారని భారతి ఆరోపించింది. ఈ మేరకు అన్నామలై ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణ సరికాదంటూ లాయర్ ద్వారా భారతికి నోటీసు పంపారు. ఇలాంటి ఆరోపణలతో తన ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నామలై అన్నారు. భారతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

ఏప్రిల్ 14న అన్నామలై డీఎంకే నేతల ఆస్తుల వివరాలను ఓ వీడియో ద్వారా రిలీజ్ చేశారు. దాదాపు 15 నిమిషాల వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. డీఎంకే మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు ఆ వీడియోలో కనిపించాయి. ఈ విషయమై డీఎంకే ఎంపీ కనిమోరి శనివారం అన్నామలైకి లీగల్ నోటీసు పంపారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవని , అందుకోసం పరువు నష్టం కిందా కోటి పరిహారం ఇవ్వాలని కనిమోరి డిమాండ్ చేశారు.ఆ వీడియో కనిమోరి పరువు తీసేలా ఉందని నోటీసులో పేర్కొన్నారు. తనని కించపరిచేలా వీడియో విడుదల చేసిన అన్నామలై కోటి రూపాయల పరిహారం డిమాండ్ చేశారు. లేదా సదరు వీడియోని డిలేట్ చేయాల్సిందిగా అన్ని ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి దాన్ని రిమూవ్ చేసి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు . అలా కానీ పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Read More: Chennai: చెన్నైలో షాకింగ్ ఘటన.. విమానాశ్రయంలో వివాహిత ఆత్మహత్య