Site icon HashtagU Telugu

Kangana Ranaut : ఎంపీ కంగనా రనౌత్‌ చెంప చెళ్లుమనిపించిన (CISF) కానిస్టేబుల్‌

Kangana Ranaut Slapped By C

Kangana Ranaut Slapped By C

ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత కంగనా ఢిల్లీకి వెళ్లడానికి చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్‌ కంగనా చెంపచెళ్లుమనిపించింది.

ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్‌ను కుల్విందర్ కౌర్‌గా గుర్తించారు. రైతులను అగౌరపరిచినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే కంగనా సహాయకుల్లో ఒకరు స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కంగనా తన ఎక్స్ ఖాతాలో వివరించింది. నేను క్షేమంగా ఉన్నాను. సెక్యూరిటీ చెక్-ఇన్‌లో మహిళా గార్డు నన్ను కొట్టిందని తెలిపారు. ఇక కంగనా 2024 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను ఆమె 74,755 ఓట్ల తేడాతో గెలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

2006లో అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్ స్టర్’ చిత్రంతో 17 ఏళ్ల వయసులోనే సినీ రంగం చేసిన కంగనా రనౌత్ ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘మణికర్ణిక’, ‘ఫ్యాషన్’, ‘పంగా’ తదితర చిత్రాల్లో తన నటనతో ప్రశంసలు అందుకుంది. 2019 లో పౌరసత్వ (సవరణ) చట్టం, రైతుల నిరసనలు వంటి అంశాలపై కంగనా రనౌత్ ప్రధాని మోడీకి బహిరంగ మద్దతు తెలిపి బిజెపికి దగ్గరైంది. ఇక ఇప్పుడు బిజెపి తరుపున గెలిచి ఎంపీ అయ్యింది.

Read Also :