Minister Vikramaditya : కంగనా ఫై పొగుడుతూనే సెటైర్లు వేసిన కాంగ్రెస్ మంత్రి

ఆమె సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకున్నారని, అలాగే హిమాచల్‌ప్రదేశ్‌కు కూడా పేరు తెచ్చారని గుర్తుచేశారు. కానీ ఇది రాజకీయ రంగం.. ఆమెకు సినిమా రంగమే ప్రాముఖ్యం

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 09:27 PM IST

దేశ వ్యాప్తంగా లోక్ సభ (Lok Sabha) ఎన్నికల హోరు మొదలైంది. మరో 45 రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సభల్లో , సమావేశాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా బిజెపి (BJP) ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ లో బాలీవుడ్ నటి కంగనా (Kangana Ranaut) పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌ బరిలో ఆమె పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిందో లేదో కాంగ్రెస్ పార్టీ విమర్శలు , సెటైర్లు వేయడం మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మంత్రి విక్రమాధిత్య సింగ్ (Vikramaditya Singh) మాట్లాడుతూ..కంగనా గెలిస్తే.. మూడింట ఒక వంతు సమయం కూడా నియోజకవర్గంలో ఉండరని తెలిపారు. ఆమె సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకున్నారని, అలాగే హిమాచల్‌ప్రదేశ్‌కు కూడా పేరు తెచ్చారని గుర్తుచేశారు. కానీ ఇది రాజకీయ రంగం.. ఆమెకు సినిమా రంగమే ప్రాముఖ్యం.. అలాంటప్పుడు గెలిచాక కనీసం మూడింట ఒక వంతు సమయమైనా హిమాచల్‌ప్రదేశ్‌కు కేటాయించగలరా? అని మంత్రి సందేహం వ్యక్తం చేశారు. స్టార్‌డమ్‌తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదని హితవు పలికారు.

బీజేపీ.. కంగనా స్టార్‌డమ్‌ మీదే ఆధారపడుతోందని మంత్రి విమర్శించారు. కేవలం స్టారడమ్‌ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదని పేర్కొన్నారు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలీవుడ్‌ సినిమా పరిశ్రమేనన్నారు. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదని.. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్‌డమ్‌ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలని ప్రజలకు మంత్రి విక్రమాధిత్య విజ్ఞప్తి చేశారు.

Read Also : Lok Sabha Polls: కాంగ్రెస్ ఆరో లిస్ట్ విడుదల..