MPPCC Chief : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఔట్.. ? ఎందుకు ?

MPPCC Chief :  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 09:04 AM IST

MPPCC Chief :  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న కమల్‌నాథ్ స్థానంలో మరొకరిని నియమించాలని హైకమాండ్ యోచిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని కమల్‌నాథ్‌కు కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారు ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకుగానూ 163 చోట్ల బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 66 చోట్ల మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 50 సీట్లు తగ్గాయి. ఎన్నికల ఫలితాలలోనే కాదు.. ప్రచారంలో కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ చాలా వెనుకంజలో ఉంది. బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు, ర్యాలీలలో.. కనీసం సగం కూడా కాంగ్రెస్  నిర్వహించలేకపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ సారథ్యంలో లోపం వల్లే ఇలా జరిగిందనే ఫీడ్ బ్యాక్ కాంగ్రెస్ హైకమాండ్‌కు అందిందని తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా కమల్‌నాథ్‌ను ప్రకటించినా ప్రజలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని.. ఈనేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గుర్తుతోనే ప్రజల్లో ఉండటం బెటర్ అనే ఒపీనియన్‌లో హస్తం పార్టీ హైకమాండ్ ఉందని తెలుస్తోంది.

Also Read: Singareni Elections : సింగరేణి ఎన్నికలకు అంతా రెడీ.. ఎప్పుడు ?

ఎన్నికల ప్రచారం పీక్ లెవల్‌లో ఉన్న టైంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌‌పై కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అఖిలేష్-వఖిలేష్’ అంటూ సమాజ్‌వాదీ చీఫ్‌ను ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యతో రగిలిపోయిన సమాజ్‌వాదీ చీఫ్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులను దింపి.. కాంగ్రెస్ ఓట్లను చీల్చారు.  అనంతరం కాంగ్రెస్ టార్గెట్‌గా అఖిలేష్ వరుసపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఇండియా కూటమిలోని అనైక్యతను ప్రజలు నెగెటివ్‌గా తీసుకున్నారు. ఐక్యత లేని ఇండియా కూటమి కంటే.. బలంగా ఉన్న బీజేపీయే మేలనే ఉద్దేశంతో ఓట్లు వేశారు. ఈ అంశాలపైనా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలన చేస్తోంది. వీటి ప్రకారం రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బలోపేతానికి(MPPCC Chief) ప్లాన్ రెడీ చేస్తోంది.