అయోధ్య (Ayodhya) లో 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడింది. అయోధ్య రామ మందిరం (Ram Mandir) ఏర్పాటు చేసి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు, వీడియోలు ఇలా ఎన్నో బయటికి వచ్చాయి.
ఈ మహా వేడుక పట్ల ఎంతోమంది స్పందిస్తూ వస్తుండగా..తాజాగా కమల్ హాసన్ (Kamal Haasan) మాత్రం భిన్నంగా స్పందించారు. రామ మందిరం గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. దానికి కమల్ నేరుగా సమాధానం చెప్పకుండా ‘నాకు ఇప్పటికీ 30ఏళ్ల క్రితం ఉన్న అభిప్రాయమే ఉంది’ అన్నారు. అప్పట్లో ఈ విషయంపై ‘బాబ్రీ మసీదును ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదు. తంజావూరు దేవాలయం, వేలన్కణి చర్చిలాగే ఇదీ నాదే’ అని కమల్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
1991లో అయోధ్యలో బాబ్రీ మసీదు కారణంగా జరిగిన అల్లర్ల సమయంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ రామ మందిరం ఉన్నా.. బాబ్రీ మసీదు ఉన్నా తేడా లేదని వివరించారు. మతపరమైన విభేదాలు లేని ప్రజలపైనే తన విశ్వాసం అని తెలిపారు. ఆయన తన ‘హే రామ్’ సినిమాలోని ‘రామర్ ఆనలం బాబర్ ఆనలం’ అనే పాటలో ఇదే విషయాన్ని నొక్కి వాక్కికరించారు.
Read Also : CM Jagan : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేవుడే బుద్ధి చెపుతాడు – సీఎం జగన్