Former PM Manmohan Singh Dies : మన్మోహన్ మృతిపై చిరంజీవి రియాక్షన్

Manmohan Singh Dies : మన్మోహన్ సింగ్ దేశానికి గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి, వినయంగా ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Chiru Manmohan

Chiru Manmohan

భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ (Former PM Manmohan Singh) మృతి పట్ల దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ దేశానికి గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి, వినయంగా ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. రెండు సార్లు ప్రధాని గా తన ప్రాభవంతో దేశ చరిత్రలో ప్రతిష్ఠిత మార్పులు తెచ్చిన మహానుభావుడని చిరంజీవి (Chiranjeevi) అన్నారు.

మన్మోహన్ సింగ్ హయాంలో, చిరంజీవి పార్లమెంట్ సభ్యుడిగా, పర్యాటకశాఖ సహాయమంత్రిగా పని చేసిన అదృష్టాన్ని గుర్తు చేస్తూ, ఆయన నుండి అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఈ సందర్భాంగా మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే నటుడు కమలహాసన్ (Kamal Hassan) సైతం మన్మోహన్ మృతి పై స్పందిస్తూ, దేశం ఓ గొప్ప పండితుడిని కోల్పోయిందని అన్నారు. మన్మోహన్ జ్ఞానం, దూరదృష్టితో దేశ ఆర్థిక, సామాజిక రంగాలను పునర్నిర్మించి, అనేక ప్రాంతాలలో మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నిర్ణయాలు దేశ ప్రజలకు లాభపడాయని కమలహాసన్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ వారసత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని , ఆయన పాలనలో తీసుకున్న ఆర్థిక చర్యలు, ద్రవ్య పాలన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆత్మనమ్మకాన్ని ఇచ్చాయని అన్నారు. ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ మృతికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read Also : PM Modi Tribute To Manmohan Singh: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాని మోదీ

  Last Updated: 27 Dec 2024, 12:19 PM IST