Judges Invited : ఆ ఐదుగురు జడ్జీలకు రామమందిర ఆహ్వానం.. ఎవరు ?

Judges Invited : ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2019లో అయోధ్య రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Judges Invited

Judges Invited

Judges Invited : ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2019లో అయోధ్య రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ధర్మాసనంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ , మాజీ సీజేఐ ఎస్‌ఏ బాబ్డే, ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్‌ ఉన్నారు.  కొత్త విషయం ఏమిటంటే.. ఆనాడు తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు అందరినీ జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. దాదాపు 50 మంది  న్యాయరంగ ప్రముఖులకు రామమందిర ఆహ్వానం అందింది. ఈ జాబితాలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాగా, ఈ వేడుకకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సాధువులు సహా మొత్తం 7వేల మందికి రామాలయ  ట్రస్టు ఆహ్వాన లేఖలను(Judges Invited) అందించింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. 

ఈ నెల 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మహత్కార్యాన్ని చూసేందుకు దేశంలోని భక్తులతో పాటు ప్రపంచం నలుమూలలు నుంచి తరలి వస్తున్నారు. అలా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు రామ మందిరం ట్రస్ట్ తో పాటు అయోధ్య ప్రజలు  సైతం సన్నద్ధం అవుతున్నారు. ఈనేపథ్యంలో దేశంలోని పలువురు భక్తులు భారీగా విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈక్రమంలోనే మన హీరో ప్రభాస్ కూడా భారీ విరాళం అందించారు. ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం రామ మందిరం ట్రస్ట్‌కు దాదాపు రూ.50 కోట్ల విరాళాన్ని ప్రభాస్ అందించారట. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన రోజు(జనవరి 22న) అయోధ్యకు వచ్చే భక్తులకు అయ్యే భోజన ఖర్చులన్నీ ప్రభాస్ భరించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త చూసిన తెలుగు ఆడియన్స్ ..‘‘రాజు ఎక్కడున్నా రాజేరా’’ అంటూ ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Bilkis Bano Case : ఆదివారంలోగా లొంగిపోండి.. బిల్కిస్ బానో కేసు దోషులకు ‘సుప్రీం’ ఆర్డర్

అయోధ్య రామయ్యకు.. సిరిసిల్ల బంగారు చీర

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్ మరో వినూత్న ప్రయోగానికి తెరలేపారు. అయోధ్య శ్రీరామచంద్రుడు పాదాల చెంత బంగారు చీర ఉంచనున్నారు. హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించనున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఈ బంగారు చీరను పరిశీలించారు.

  Last Updated: 19 Jan 2024, 02:12 PM IST