Site icon HashtagU Telugu

Judge-Rahul Gandhi : రాహుల్ శిక్షపై స్టేకు నిరాకరించిన జడ్జికి త్వరలో ట్రాన్స్ ఫర్ !?

Judge Rahul Gandhi

Judge Rahul Gandhi

Judge-Rahul Gandhi : “మోడీ ఇంటిపేరు” వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ వేసిన అప్పీల్ పిటిషన్ ను కొట్టేసిన గుజరాత్ హైకోర్టు  న్యాయమూర్తి  జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ త్వరలో ట్రాన్స్ ఫర్ కాబోతున్నారు. తాజాగా బదిలీల కోసం సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించిన హైకోర్టు న్యాయమూర్తుల లిస్టులో జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ పేరు కూడా ఉంది. బీహార్ లోని పాట్నా హైకోర్టుకు జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్  ను ట్రాన్స్ ఫర్ చేయాలని  కొలీజియం రికమెండ్ చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న  బీజేపీ నేత  మాయా కొద్నానీ తరఫున కూడా అప్పట్లో జస్టిస్ ప్రచ్చక్ కొంతకాలం వాదించారు.  నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాష్ట్ర  ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ ప్లీడర్‌గా జస్టిస్ ప్రచ్చక్ (Judge-Rahul Gandhi)  పనిచేశారు. 2015లో నరేంద్ర మోడీ  ప్రధానమంత్రి అయిన తర్వాత..  గుజరాత్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. ఈ పోస్టులో ఆయన 2019 వరకు కొనసాగారు. 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Also read : Amala Paul: పాల్.. పాల్.. అమలాపాల్.. బికినీ షో తో గ్లామర్ హద్దులు చేరిపేస్తున్న బ్యూటీ

ఇక గుజరాత్ హైకోర్టుకే చెందిన న్యాయమూర్తులు జస్టిస్ గీతా గోపిని మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ సమీర్ జె దవేను రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ అల్పేష్ వై కోగ్జేను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సూచించింది. “మెరుగైన న్యాయ నిర్వహణ” కోసం ఈ నలుగురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు  కొలీజియం ఆగస్టు 10న ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. జస్టిస్ గీతా గోపి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ అప్పీల్ పిటిషన్ ను విచారించనని స్పష్టం చేశారు. ఆ విచారణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2002 గోద్రా అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలను సృష్టించారని తనపై నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని సామాజిక  ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ వేసిన  పిటిషన్ పై విచారణ జరిపే బెంచ్ నుంచి గత వారమే జస్టిస్ సమీర్ దవే తప్పుకున్నారు. ఈనేపథ్యంలో ట్రాన్స్ ఫర్స్ లిస్టులో ఈ జడ్జీల పేర్లు కూడా చేర్చడం గమనార్హం.