Karnataka elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పరస్పర దాడులు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినాయకులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ బెయిల్ పై, సోనియా గాంధీ బెయిల్ పై, డీకే శివకుమార్ బెయిల్ పై ఉన్నారని జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ లో సగం మంది నాయకులు బెయిల్‌పై ఉన్నారని, సగం మంది జైల్లో ఉన్నారని అన్నారు. అవినీతికి పాల్పడి అభివృద్ధి పనులకు బ్రేకులు వేశారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే పీఎఫ్‌ఐ పునరాగమనం కోసం వేసినట్లేనని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు.
9 ఏళ్ల క్రితం భారతదేశం ఎలా ఉండేదని ప్రశ్నించారు జేపీ నడ్డా. అంతకుముందు భారతదేశం అవినీతికి పేరుగాంచింది. కాంగ్రెస్ పాలనలో భారతదేశం అనిశ్చిత స్థితిలో ఉందని, కానీ ఇప్పుడు భారతదేశం మోడీ నేతృత్వంలో G20 మరియు SCO సమావేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు నడ్డా. ప్రపంచ నలుమూలల నుండి ప్రధాన మంత్రులు, మంత్రులు మరియు విదేశాంగ మంత్రులు వస్తున్నారు. భారతదేశానికి ఈ గుర్తింపును ప్రధాని మోదీ సృష్టించారని అన్నారు.