Site icon HashtagU Telugu

NDA Meeting : ఎన్డీఏకు 25 ఏళ్ళు.. దేశ హితం కోసం ఎవరైనా ఎన్డీఏలో చేరొచ్చు.. మీటింగ్‌పై JP నడ్డా కామెంట్స్..

Jp Nadda Comments on NDA Meeting

Jp Nadda Comments on NDA Meeting

2024 లోక్ సభ ఎన్నికల(Elections) కోసం అధికార, విపక్ష పార్టీలు తమ కూటములను రెడీ చేసుకుంటున్నాయి. ఈక్రమంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) కూటమి, కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని యుపిఎ కూటమి బల ప్రదర్శనకు రెడీ అయ్యాయి. ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు మద్దతునిచ్చే పార్టీలతో ఆయా కాంగ్రెస్, బీజేపీలు భేటీ కాబోతున్నాయి. సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) బెంగళూరు వేదికగా 24 విపక్ష పార్టీలు సమావేశం కాబోతుండగా మంగళవారం (జులై 18న) ఢిల్లీ(Delhi) వేదికగా దాదాపు 30 పార్టీల మద్దతు కలిగిన ఎన్డీఏ కూటమి భేటీ జరగబోతోంది.

రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ అశోక హోటల్ లో ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. దాదాపు 30కి పైగా పార్టీలు హాజరు కానున్నాయి. ఎన్డీఏ భేటీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా(JP Nadda) మీడియాతో మాట్లాడారు.

JP నడ్డా మాట్లాడుతూ.. ఎన్డీఏ సిద్ధాంతాలు, 9 ఏళ్ళ పాలనపై సమావేశంలో చర్చ ఉంటుంది. ఎన్డీఏ 25 ఏళ్లను పూర్తి చేసుకుంటుంది. ఎన్డీఏ అజెండా దేశంకోసం అందరిని కలుపుకు వెళ్లడమే. దేశ విస్తృత ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఎన్డీఏ అధికారం కోసం కాదు, దేశ సేవ కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం. ఎన్డీఏ దేశ రాజ్యాంగాన్ని కాపాడుతుంది. 2024లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎన్డీఏలో ఎవరిని వదిలేయలేదు. అందరితో స్నేహంగానే ఉన్నాం. దేశహితం కోసం ఎవరైనా ఎన్డీఏలోకి రావచ్చు. యుపిఏకి నీతి నియమాలు లేవు. యుపిఏకి నిర్ణయాలు తీసుకునే సత్తా లేదు. 20 లక్షల కోట్ల కుంభకోణం నుంచి కాపాడుకునే ప్రయత్నమే విపక్ష కూటమి చేస్తుంది అని వ్యాఖ్యానించారు.

 

Also Read : Delhi Road Map : ఒకే వేదిక‌పై పురంధ‌రేశ్వ‌రి, ప‌వ‌న్.! NDA స‌మావేశం త‌రువాత‌..?