Jodo Congress : మెరుపుదాడులపై దిగ్విజ‌య్, జైరాం ర‌మేష్ కీల‌క వ్యాఖ్య‌లు

స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ వ్య‌వ‌హారాన్ని దిగ్విజ‌య్ సింగ్ (Jodo Congress) బ‌య‌ట‌కు తీశారు.

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 02:04 PM IST

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ వ్య‌వ‌హారాన్ని దిగ్విజ‌య్ సింగ్ (Jodo Congress) బ‌య‌ట‌కు తీశారు. ఆ రోజున జ‌రిగిన స‌ర్టిక‌ల్ స్ట్రైక్ (Surgical strike)స‌రే, భార‌త సైన్యంలోని 19 మంది చ‌నిపోయిన విష‌యం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లోనూ దిగ్విజ‌య్ సింగ్ ఇదే వ్యాఖ్య‌ల‌ను చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్య‌ల మీద ఉన్నారు. భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేష్ స్పందించారు. భార‌త జ‌వాన్ల‌ను కోల్పోయిన త‌రువాత జ‌రిగిన మెరుపుదాడుల గురించి మోడీని అడ‌గాల‌ని మీడియాకు చుక‌లంటించారు.

స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ వ్య‌వ‌హారాన్ని దిగ్విజ‌య్ సింగ్ (Jodo Congress)

మెరుపుదాడుల‌కు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట పెట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ (Jodo Congress) చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అప్ప‌ట్లో పార్ల‌మెంట్ లోనూ అధికార బీజేపీ ప‌క్షాన్ని నిలదీసింది. ఇప్పుడు కూడా మెరుపుదాడుల‌కు సంబంధించిన న్యూస్ ఉత్త‌దేనంటూ మోడీ ప్ర‌భుత్వాన్ని జైరాం ర‌మేశ్ విమ‌ర్శించారు. 2016లో జ‌రిగిన మెరుపుదాడుల(Surgical Strikes) దాడుల గురించి ప‌లు అనుమానాల‌ను కాంగ్రెస్ పార్టీ లేవ‌నెత్తుతోంది. వాటి ఆధారాల‌ను బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేస్తూ ఉంది. సాయుధ ద‌ళాల ప‌ట్ల గౌవ‌రం ఉంద‌ని చెబుతూ 2016వ ఏడాది జ‌రిగిన మెరుపుదాడుల అంశాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు దిగ్విజయ సింగ్ గుర్తు చేశారు.

Also Read : Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ

ఇదే విష‌యాన్ని జైరాం ర‌మేశ్ ను ప్ర‌శ్నించ‌గా ఈ విషయంపై పార్టీ ఇప్పటికే మాట్లాడిందని గుర్తు చేశారు. అన్ని ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ పార్టీ స‌మాధానం ఇచ్చింద‌ని, మిగిలిన విష‌యాల‌పై మోడీని ప్ర‌శ్నించాల‌ని మీడియాకు చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ లోని ఉరీ. సెక్టార్లో భారత ఆర్మీ ప్రధాన కార్యాలయంపై 19 మంది సైనికులను చంపిన మాట వాస్త‌వం. ఆ తరువాత పొరుగు దేశం పాకిస్థాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్‌పై దిగ్విజయ్ సింగ్ ప్రశ్నిస్తూ వివాదం రేకెత్తించారు. “వారు (కేంద్రం) సర్జికల్ స్ట్రైక్ జరిగిందని పేర్కొన్నారు కానీ రుజువు చూపలేదు. వారు అబద్ధాలను మాత్రమే ప్రచారం చేశార‌ని సింగ్ చెప్పాడు.

యూపీఏ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది…

కాంగ్రెస్ మాత్రం సింగ్ వ్యాఖ్యలకు దూరంగా ఉంది. అతని అభిప్రాయాలు వ్య‌క్తిగ‌తం అంటూ అని చెప్పింది. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన సొంతం. కాంగ్రెస్ పార్టీ ప‌రంగా తీసుకోవాల్సిన అవ‌స‌రంలేద‌ని చెబుతోంది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని సైనిక చర్యలకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అలాంటి ప‌రిస్థితిని కాంగ్రెస్ కొన‌సాగిస్తుంద‌ని జైరాం రమేష్ అన్నారు.

Also Read : T Congress : దిగ్విజ‌య్ సింగ్‌తో ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భేటీ

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా రాహుల్ ప‌లు వివాద‌స్ప‌ద అంశాల‌ను త‌ర‌చూ బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఆయ‌న వెంట న‌డిచే వాళ్లు కూడా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇప్పుడు దిగ్విజ‌య్ సింగ్ మెరుపుదాడుల అంశాన్ని లేవ‌నెత్తారు. అంతేకాదు, క‌శ్మీర్ ను మ‌ళ్లీ ప్ర‌త్యేక ప్రాంతంగా చేస్తామ‌ని రాహుల్ చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.