స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనుందని బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించి, నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లలో కెరీర్ ఆశించే వారికి ఇది మంచి అవకాశం. ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి ఇంటర్వ్యూ లేదా ఆన్‌లైన్ పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు.
Abhishek Sharma: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టే దిశగా అభిషేక్ శర్మ!
అర్హత విషయానికి వస్తే, సంబంధిత పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, పీజీ, CA, CSA, CFP, MBA, PG డిప్లొమా, PGDM వంటి అర్హతలతో పాటు నిర్దిష్ట పని అనుభవం తప్పనిసరి. స్పెషలైజేషన్ ఆధారంగా అభ్యర్థుల నైపుణ్యాలు, అనుభవాన్ని SBI ప్రాముఖ్యంగా పరిశీలించనుంది. పనిచేసే రంగాల్లో చట్టపరమైన విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ తదితర విభాగాలు ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, సాధారణ (General), OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు రూ.750 రూపాయల ఫీజు నిర్ణయించారు. కాగా SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, పోస్టుల విభజన, ఎంపిక విధానం తదితర వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలను వెతుకుతున్న వారు ఇటువంటి నోటిఫికేషన్ల కోసం తరచుగా అప్డేట్స్ చూడటం మంచిది.
