Site icon HashtagU Telugu

Jobs in Coal Mining Sector : కేవలం డిగ్రీ అర్హతతో బొగ్గు గనుల విభాగంలో ఉద్యోగాలు

Jobs In Coal Mining Sector

Jobs In Coal Mining Sector

భారత ప్రభుత్వ బొగ్గు గనుల (Coal Mining Sector) మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు చూస్తే..

పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (E-2 గ్రేడ్)
మొత్తం ఖాళీలు: 640
జనరల్: 190
ఈడబ్ల్యూఎస్: 43
ఎస్సీ: 67
ఎస్టీ: 34
ఓబీసీ: 124
విభాగాల వారీగా ఖాళీలు
మైనింగ్: 263
సివిల్: 91
ఎలక్ట్రికల్: 102
మెకానికల్: 104
సిస్టమ్: 41
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్: 39
అర్హతలు
కనీసం 60% మార్కులతో మైనింగ్/సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో BE/B.Tech లేదా MCA.
GATE 2024లో అర్హత సాధించాలి.
అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు (సెప్టెంబర్ 30, 2024).
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 29, 2024
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 11, 2024
నవంబర్ 28, 2024వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయాలి.
ఫీజులు
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.1180
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: ఫీజు మినహాయింపు.
జీతం
ఎంపికైన వారికి నెలకు రూ.50,000 నుండి రూ. 1,60,000 వరకు జీతం అందించబడుతుంది.