దేశంలో ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 50 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆర్థిక, బ్యాంకింగ్ రంగంలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పోస్టు ఆధారంగా అభ్యర్థులు డిగ్రీ, పీజీ, లేదా CA/CMA/CS/CFA/డిప్లొమా (ఫైనాన్స్) అర్హతలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలి. అదనంగా సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక విశ్లేషణ నైపుణ్యం, మరియు మేనేజీరియల్ సామర్థ్యాలను పరీక్షించేలా రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. చివరగా అన్ని ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఫైనల్ సెలెక్షన్ జాబితా ప్రకటించబడుతుంది. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!
ఫీజు విషయానికి వస్తే, సాధారణ మరియు OBC అభ్యర్థులు రూ.850, SC, ST, PWBD అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎంపికైనవారికి ప్రభుత్వ నియమావళి ప్రకారం వేతనం, ఇతర సౌకర్యాలు అందజేయబడతాయి. దరఖాస్తు వివరాలు, అర్హతలు, మరియు పరీక్షా తేదీల గురించి మరింత సమాచారం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.