Site icon HashtagU Telugu

335 PA Posts : డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్​ఓ‌లో 335 పీఏ పోస్టులు

335 Pa Posts

335 Pa Posts

335 PA Posts : ఏదైనా డిగ్రీ పూర్తి చేసి స్టెనోగ్రఫీ, టైపింగ్​ నైపుణ్యం కలిగినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశమిది. ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్​ ఆర్గనైజేషన్​ (ఈపీఎఫ్​ఓ)లో 335 పీఏ పోస్టుల భర్తీకి యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్​సీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి  కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో (https://upsconline.nic.in/) అప్లై చేయొచ్చు. మొత్తం 335 పోస్టులలో(335 PA Posts).. అన్​రిజర్వ్​డ్ పోస్టులు  132, ఓబీసీ కేటగిరి పోస్టులు 87, ఎస్సీ కేటగిరి పోస్టులు 48,  ఈడబ్ల్యూఎస్​ కేటగిరి పోస్టులు 32, ఎస్టీ కేటగిరి పోస్టులు 24, దివ్యాంగుల కేటగిరి పోస్టులు 12 ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

Also Read : 2024 Summer : తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సమ్మర్ ఎలా ఉంటుందో తెలుసా ?

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 272 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139గాఉన్నాయి. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల ప్రక్రియ మార్చి 18 వరకు కొనసాగుతుంది. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. మొత్తం 272 పోస్టులలో.. ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) పోస్టులు 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ పోస్టులు 10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) పోస్టులు 02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు 18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) పోస్టులు  22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) పోస్టులు 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 30 ఉన్నాయి. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు 16 ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు  మార్చి 18. అధికారిక వెబ్ సైట్ https://scclmines.com/.

Also Read :Dragon Bike : డ్రాగన్ బైక్‌.. మేడిన్ ఇండియా.. సామాన్య మెకానిక్ అసామాన్య ఆవిష్కరణ