జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (J&K Terror Attack) దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనగా నిలిచింది. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి (Commander Saifullah Kasuri) అనే వ్యక్తి అని తెలుస్తోంది. దాడికి ముందు ఖలీద్ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించినట్లు నిఘా సంస్థల సమాచారం. ఈ దాడి వెనుక ఉన్న కుట్రలు, విదేశీ ప్రమేయం, ఉగ్ర సంస్థల మద్దతు అంశాలపై దర్యాప్తు అధికారులు తీవ్రంగా గమనిస్తున్నారు.
Veeraiah Chowdary : వీరయ్య చౌదరి శరీరంపై కత్తిపోట్లు చూసి చంద్రబాబు కన్నీరు
ఖలీద్ కసూరి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-E-Taiba) సంస్థలో కీలక వ్యక్తిగా ఉంటూ, ఆ సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడిగా పనిచేస్తున్నాడు. లష్కరే పెషావర్ కార్యాలయానికి నాయకత్వం వహించడమే కాకుండా, జమాత్ ఉద్ దవా రాజకీయ విభాగమైన మిల్లీ ముస్లీంలీగ్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతను అమెరికా విదేశాంగ శాఖ ద్వారా ఉగ్రవాదిగా గుర్తించబడి, గ్లోబల్ టెర్రరిస్ట్‌గా చట్టబద్ధంగా బ్రాండెడ్ అయ్యాడు. ప్రస్తుతం ఖలీద్ ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం, అతనికి ఐఎస్ఐ, పాక్ ఆర్మీతో బలమైన సంబంధాలున్నాయనేది నిఘా సంస్థల విశ్లేషణ.
Earthquake : టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం
ఈ దాడిలో ఖలీద్‌కి తోడుగా పాక్ ఆర్మీకి చెందిన మాజీ వ్యక్తి ఆసీఫ్ ఫౌజీ, మరో ఇద్దరు పీఓకే నుంచి వచ్చిన ముష్కరులు, ముగ్గురు స్థానికుల మద్దతు ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడి సమయంలో ముష్కరులు పష్తూన్ భాషలో సంభాషించినట్లు తెలుస్తోంది. ఇది కూడా వీరికి పాకిస్థాన్ అనుబంధం ఉన్నదనేది నిర్ధారించగలిగే ఆధారంగా మారింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. అసలు నిందితులను ఎప్పటి లోపు పట్టుకొని శిక్షిస్తారో అన్న ఆశతో దేశం ఎదురుచూస్తోంది.