హరియాణా (Haryana), జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. హరియాణాలో కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించనుందని.. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అంచనా వేశాయి. ఇవే నిజమైతే బీజేపీ(BJP)కి ఈ ఫలితాలు అతిపెద్ద షాక్ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హరియాణాలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈనెల 5న జరిగిన పోలింగ్‌లో 65.65శాతం ఓటింగ్ నమోదైంది.
జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1.. ఇలా మూడు దశల్లో పోలింగ్ జరిగింది. మరోవైపు 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటములు ధీమాగా ఉన్నాయి. కౌటింగ్ నేపథ్యంలో ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటె ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు ఆ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.
Read Also : IIFA awards 2024: ఉత్తమ నటుడిగా హనుమాన్