Site icon HashtagU Telugu

Champai Soren: జార్ఖండ్‌లో మరో సంచలనం.. చంపాయ్ సోరెన్ కొత్త పార్టీ ప్రకటన

Champai Soren

Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు చంపాయ్ సోరెన్ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం ఓ ట్వీట్‌లో సంకేతాలు ఇచ్చారు.

చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరనున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. చంపై సోరెన్ మొదట సారి కొత్త పార్టీ ప్రకటన చేసిన సమయంలో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరవచ్చని అంతా భావించారు. ఇది మాత్రమే కాదు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కూడా ఒక ట్వీట్ చేశారు. ఎన్డీయే కుటుంబానికి టైగర్‌కు స్వాగతం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో చంపాయ్ సోరెన్ బీజేపీలోకి ఖాయమని అందరూ భావించారు. కానీ రాజకీయ సమీకరణాల మధ్య ఆయన కొత్త పార్టీకి ప్రాణం పొయనున్నారు.

చంపాయ్ సోరెన్ రాజకీయాల నుంచి విరమించుకోనని, కొత్త పార్టీ పెడతానని చెప్పారు. దీనితో పాటు చంపై సోరెన్ కూడా పొత్తుకు తలుపులు తెరిచారు. నేను పదవీ విరమణ చేయను. పార్టీని బలోపేతం చేస్తాను, కొత్త పార్టీ పెడతాను. దారిలో మంచి మిత్రుడు కలిస్తే.. ఆయనతో కలిసి ముందుకు సాగుతానని చంపాయ్ సోరెన్ అన్నారు. జనవరిలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 2న రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారని, అయితే హేమంత్ సోరెన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు రాగానే, జూలైలో 3 చంపై సోరెన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత చంపై సోరెన్ ఆగ్రహం పెరగడం మొదలైంది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరగడంతో ఆయన తిరుగుబాటు ధోరణి కనిపించింది. మూడు రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న ఆయన బీజేపీలో చేరే అవకాశం పెరిగినా.. అలా చేయకుండా ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఇంకా పార్టీ పేరును ప్రకటించలేదు.

Also Read: IPL 2025: వేలంలోకి బుమ్రా, ఆర్సీబీ ప్రయత్నాలు